సన్నాహక సమావేశం @ మహాయజ్ఞం -2018

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి.
108 సరస్వతి విగ్రహాలతో నిర్వహించ తపపెట్టిన  "శ్రీ సరస్వతి మహా యజ్ఞం" సమర్ధ నిర్వహణ కోసం ట్రస్ట్ సబ్యులు మరియు కమిటీల సబ్యులచే ఆత్మీయ సమావేశం.
22.05.2017 @ అయ్యప్ప దేవాలయo, కర్మన్ ఘాట్.

కార్యక్రమ నిర్వహణ కోసం 108 మంది సబ్యులచే వేసిన 9 కమిటి సబ్యుల పరిచయం. కార్యక్రమ విది విదానాల వివరణ. 
సమావేశ తేది: 22-05-2017, 6 to 9.30 pm 
సమావేశ స్థలం : శ్రీ అయ్యప్ప దేవాలయం, కర్మన్ ఘాట్.
పూజ్యశ్రీ హంపీ విద్యారణ్య భారతి స్వామిజి, మాన్యశ్రీ అపాల ప్రసాద గారు ( సామాజిక సమరసతా వేదిక), బసవరాజు శ్రీనివాస్ రావు గారు ( హంపీ పీఠ0 కార్యదర్శి), రెవల్లే రాజు శర్మ ( చండి ఉపాసకులు), గున్నా రాజేందర్ రెడ్డి గారు ( గాంధీ గ్లోబల్  పామిలి) వంటి అతిథులు, మరియు ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు నూతనంగా నిర్ణయించిన అన్ని కమిటీల సబ్యులు పాల్గొన్నారు.


Read more

*బడి బడిలో చదువులమ్మ విగ్రహం*

GSS_విద్యాసంస్థల సమన్యయ కమిటీ సబ్యులందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. 

సంస్కారవంతమైన సమానవిద్య అందరికీ సమానంగా అందాలి_ గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి , తద్వార దేశ భవిష్యత్తు ఉజ్వలమవ్వాలి అనే ఆశయ స్పూర్తితో అన్ని స్థాయిల  విద్యా సంస్థలలో "చదువుల తల్లి, జ్ఞానప్రధాత "సరస్వతి మాత ప్రతిమల" ఏర్పాటుకు సంకల్పించింది జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి. అందులో భాగంగా 2018లో ఒకే ముహుర్తానికి 108 అమ్మవారి ప్రతిమలు "108 విద్యాసంస్థలలో"   ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. దేవాలయం కేంద్రంగా 9 మండలాలలోని అన్ని విద్యాసంస్థలను సంప్రదించే కార్యక్రమం ప్రారంభం. శుభారంభం. ఈ రోజు  యాచారం మండలంలోని  ప్రబుత్వ, ప్రైవేటు పాఠశాలలు (15) సంప్రదించడం పూర్తి.  సహకరించిన  ఆయా విద్యా సంస్థలు యాజమాన్యాలకు దేవాలయం తరపున ధన్యవాదాలు.

**  విగ్రహ దాతలు మరియు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేయగోరే  విద్యాసంస్థలు సంప్రదించవచ్చు.


Read more

*GSS_సంకల్ప భవన్*

శ్రీ మాత్రేనమహ....

బోలో సరస్వతీ మాతాకి జై..

అక్షయమైన అక్షరజ్ఞానం చిన్నారులకు అందిస్తూ...
 ఏ తారతమ్యం చూపని ఆ చదువులమ్మ చల్లని ఆశీస్సులు అతి బీదలకు కూడా చేరవేయాలనీ...

అక్షర స్వీకారం జరిగిన నాడే ఆ పసిబిడ్డ జీవితానికి మెండైన భరోసా కలగేలా తల్లిదండ్రు మరియు పెద్దల సంకల్పం జరగానీ...

ఆ""వేడుకకు వేదికగా"" నిలవాలని నిర్మించతలపెట్టిన "సంకల్ప భవన్" నిర్మాణం పనులు ప్రారంభం కావడం శుభసూచకం.

ఈ మహాకార్యంలో ప్రత్యక్ష బాగస్థులకు,  సహృదయ దాతలకు, సేవా తత్పరులకు  మరియు సహకరిస్తున్న వారందరికీ "జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్" తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

( ఆలయ అభివృద్ది పనులలో అందరం బాగస్వాములం అవుదాం _ మన వంతు సహకారం అందిద్దాం)..

~ జ్ఞానసరస్వతి సేవాసమితి.
(జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి)


Read more

#ఆలయ #పుష్కర #కుంభాభిషేకo సంపూర్ణం

*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*..


ఆలయ శ్రేయోభిలాషులందరికీ శుభాబినందనలు, శుభాకాంక్షలు...

*ఆలయ పుష్కర కుంభాబిషేక మహోత్సవం  మరియూ నూతవ దేవతా వాహనాల ప్రతిష్ట కార్యక్రమాలు  సంపూర్ణమయినాయి*..

*ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రత్యక్షంగా బాగస్తులయిన సేవాసమితి సభ్యులకు, సహకరించిన వారికి మనందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు*.

ఆలయ శ్రేయోభిలాషులు, భక్తుల ఆగమనంలో ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్న పుష్కర కుంభాబిషేక మహోత్సవం ఈ కరోనా మహమ్మారి కారణంగా కుదించబడిoది.
  వ్యవస్థలో తప్పనిసరిగా పాల్గొనాల్సిన అతి కొద్దిమందితో ఈ ఉత్సవాలు పూర్తయినాయి..  
*అమ్మవారి అనుగ్రహం, పూజ్య విద్యారణ్య స్వామీజి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు ఉన్నకొద్దిలో చాలా బగా నిర్వహించబడ్డాయి*.
 సమయానుకూలంగా ఆలయ శ్రేయోభిలాషులకు ఉత్సవ సంబందిత వీడియోలు అందుతాయి...

*అలయ నిర్మాణానికి, నిర్వహణకు సహకరిస్తున్న ధర్మకర్తల మండలి సభ్యులకు, పోషక మండకి సభ్యులకు ప్రత్యేక శుభాబినందనలు*..

*ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి ఆపన్న హస్తాలు, నిత్య చైతన్య కేంద్రాలు,  సేవా కార్యక్రమాలకు నిలయాలు*.. 
అన్నీ కలిపి ఆలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే స్ఫూర్తితో *ఈ దేవాలయం కేంద్రంగా విద్యా, వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివాలనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది*. త్వరలో అన్ని విషయాలు తెలుపబడుతాయు.  అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం...

*కృతజ్ఞతాపూర్వక దాన్యవాదాలతో*...

*సదా వెంకట్*,
*ఫౌండర్, జ్ఞానసరస్వతి సేవాసమితి & జ్ఞానసరస్వతి సంస్థాన్*.


Read more