*బడి బడిలో చదువులమ్మ విగ్రహం*

GSS_విద్యాసంస్థల సమన్యయ కమిటీ సబ్యులందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. 

సంస్కారవంతమైన సమానవిద్య అందరికీ సమానంగా అందాలి_ గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి , తద్వార దేశ భవిష్యత్తు ఉజ్వలమవ్వాలి అనే ఆశయ స్పూర్తితో అన్ని స్థాయిల  విద్యా సంస్థలలో "చదువుల తల్లి, జ్ఞానప్రధాత "సరస్వతి మాత ప్రతిమల" ఏర్పాటుకు సంకల్పించింది జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి. అందులో భాగంగా 2018లో ఒకే ముహుర్తానికి 108 అమ్మవారి ప్రతిమలు "108 విద్యాసంస్థలలో"   ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. దేవాలయం కేంద్రంగా 9 మండలాలలోని అన్ని విద్యాసంస్థలను సంప్రదించే కార్యక్రమం ప్రారంభం. శుభారంభం. ఈ రోజు  యాచారం మండలంలోని  ప్రబుత్వ, ప్రైవేటు పాఠశాలలు (15) సంప్రదించడం పూర్తి.  సహకరించిన  ఆయా విద్యా సంస్థలు యాజమాన్యాలకు దేవాలయం తరపున ధన్యవాదాలు.

**  విగ్రహ దాతలు మరియు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేయగోరే  విద్యాసంస్థలు సంప్రదించవచ్చు.


0 comments:

*GSS_సంకల్ప భవన్*

శ్రీ మాత్రేనమహ....

బోలో సరస్వతీ మాతాకి జై..

అక్షయమైన అక్షరజ్ఞానం చిన్నారులకు అందిస్తూ...
 ఏ తారతమ్యం చూపని ఆ చదువులమ్మ చల్లని ఆశీస్సులు అతి బీదలకు కూడా చేరవేయాలనీ...

అక్షర స్వీకారం జరిగిన నాడే ఆ పసిబిడ్డ జీవితానికి మెండైన భరోసా కలగేలా తల్లిదండ్రు మరియు పెద్దల సంకల్పం జరగానీ...

ఆ""వేడుకకు వేదికగా"" నిలవాలని నిర్మించతలపెట్టిన "సంకల్ప భవన్" నిర్మాణం పనులు ప్రారంభం కావడం శుభసూచకం.

ఈ మహాకార్యంలో ప్రత్యక్ష బాగస్థులకు,  సహృదయ దాతలకు, సేవా తత్పరులకు  మరియు సహకరిస్తున్న వారందరికీ "జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్" తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

( ఆలయ అభివృద్ది పనులలో అందరం బాగస్వాములం అవుదాం _ మన వంతు సహకారం అందిద్దాం)..

~ జ్ఞానసరస్వతి సేవాసమితి.
(జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి)


0 comments: